Ads

Wednesday, July 10, 2019

Gadachina Kalamu Krupalo Mammu Dachina Deva

గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము
పగలూ రేయి కనుపాపవలె కాచిన దేవా నీకే స్తోత్రము
మము దాచిన దేవా నీకే స్తోత్రము- కాపాడిన దేవా నీకే స్తోత్రము

1. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివయి నను ఆదరించినా
కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించినా
కరుణించిన దేవా నీకే స్తోత్రము - కాపాడిన దేవా నీకే స్తోత్రము

2. లోపములెన్నో దాగి ఉన్ననూ దాతృత్వములతో నను నడిపించినా
అవిధేయతలే ఆవరించినా దీవెనలెన్నో దయచేసినా
దీవించిన దేవా నీకే స్తోత్రము - కాపాడిన దేవా నీకే స్తోత్రము

No comments:

Post a Comment